BREAKING
thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
Test 4
Date of Publish : 25 November 2026, 08:43 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ధ్రువ్ రాఠీకి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 08:43 AM
27 వీక్షణలు

2018 పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ, నవంబర్ 25: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2018 నాటి పరువు నష్టం కేసులో ఆయనకు వ్యతిరేకంగా నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తూ న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. నవంబర్ 23న జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అనామ్ రయీస్ ఖాన్ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేసింది. 2018లో ధ్రువ్ రాఠీ రూపొందించిన ఓ వీడియో ఈ వివాదానికి కారణమైంది. బీజేపీ సమాచార సాంకేతిక విభాగం వికాస్ సంస్కృత్యాయన్ అలియాస్ వికాస్ పాండేకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిందంటూ ఆ వీడియోలో రాఠీ ఆరోపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించాయని ఆరోపిస్తూ వికాస్ పాండే పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆయన ‘ఐ సపోర్ట్ నరేంద్ర మోదీ’ అనే ఫేస్‌బుక్ పేజీ వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందారు. సమన్లు అందకపోవడంతో వారెంట్‌ ఈ వివాదంలో ఆ వీడియోను అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. దీంతో ఫిర్యాదుదారుడు ధ్రువ్ రాఠీతో పాటు కేజ్రీవాల్‌పై కూడా పరువు నష్టం కేసులు దాఖలు చేశారు. అయితే ధ్రువ్ రాఠీ విదేశాల్లో నివసిస్తున్నందున గత కొన్నేళ్లుగా ఆయనకు కోర్టు సమన్లు అందడం లేదని ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసినట్లు సమాచారం. భారత్ పర్యటనలోనూ పోలీసుల అదుపులోకి ఇదిలా ఉండగా, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా ఈ ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన నిరసనల్లో పాల్గొనేందుకు ధ్రువ్ రాఠీ భారత్‌కు వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. నిరసనల సందర్భంగా వేలాది మందిని పోలీసులు నిర్బంధించిన వ్యవహారంతో పాటు, స్వాధీనం చేసుకున్న ఫోన్ల యజమానుల డిజిటల్ హక్కుల అంశాలపై కూడా రాఠీ స్పందిస్తున్నారు. తాజాగా 2018 నాటి పరువు నష్టం కేసులో కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 3న జరిగే తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.