BREAKING
thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు
Test 4
Date of Publish : 12 November 2026, 05:34 pm
Posted by : PAGADALA DEVAIAH

ఎన్‌టీఆర్ నగర్ హమాలీ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
12 Nov, 2026 - 05:34 PM
17 వీక్షణలు

హమాలీ కార్మికులకు గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా కల్పించాలి: పగడాల యాదయ్య

ఎల్బీనగర్, నవంబర్ 12 (ఎన్‌ టుడే న్యూస్‌): సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని ఎన్‌టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సీఐటీయూ నేతృత్వంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సరూర్‌నగర్ సర్కిల్ సీఐటీయూ కన్వీనర్ మల్లెపాక వీరయ్య అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పగడాల యాదయ్య మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను అణచివేతకు గురిచేస్తున్నాయని విమర్శించారు. హమాలీ కార్మికులు లేకపోతే సరుకుల ఎగుమతి, దిగుమతులు నిలిచిపోతాయని, దేశ ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. హమాలీ కార్మికులను చిన్నచూపు చూడకూడదని అన్నారు.

కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాల్లో కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో హమాలీగా పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి ప్రభుత్వం గుర్తింపు కార్డు అందించాలని, వారు పనిచేసే మార్కెట్లలో లైసెన్స్ కార్డులు జారీ చేయాలని కోరారు. అలాగే హమాలీ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రభుత్వమే కల్పించాలని డిమాండ్ చేశారు.

నూతన కమిటీ ఎన్నిక

సమావేశం అనంతరం ఎన్‌టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ హమాలీ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు.

  • గౌరవ అధ్యక్షుడు: కట్ట శ్రీనివాస్
  • అధ్యక్షుడు: పున్నం మల్లేష్
  • ప్రధాన కార్యదర్శి: మల్లెపాక వీరయ్య
  • ఉపాధ్యక్షులు: కిరణ్, కుమార్ స్వామి, కాజా భాయ్
  • సహాయ కార్యదర్శులు: సలావుద్దీన్, మహేష్, మచ్చ నరసింహ
  • సలహాదారు: ఎం. గోపి నాయక్
  • కమిటీ సభ్యులు: జై సురేందర్ రాజ, తలారి రాజు, విజయ్ కుమార్, సీహెచ్ కృష్ణ, కే. బిక్షపతి, కే. రాజేష్, బి. నాగరాజు

ఈ సమావేశంలో సరూర్‌నగర్ సర్కిల్ సీపీఎం పార్టీ కార్యదర్శి సీహెచ్ వెంకన్న, రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య, రంగారెడ్డి జిల్లా ఆటో ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ అధ్యక్షుడు ఎం. నరహరి, సరూర్‌నగర్ సర్కిల్ ఆటో ట్రాన్స్‌పోర్ట్ కార్యదర్శి కడారి రాములు, జి. మనోహర్‌తో పాటు పలువురు హమాలీ కార్మికులు పాల్గొన్నారు.