రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం
తెలంగాణ
/
ఖమ్మం
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం–బనిగళ్లపాడు రహదారిపై రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తితో పాటు చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో కృష్ణాజిల్లా మైలవరం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన సకుర్తి రాంబాబు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొరకుప్పుల ప్రేమ్‌కుమార్‌తో పాటు ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు.
ప్రేమ్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.