BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 12:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పదవీ విరమణ చేసినా ప్రజాసేవకు విరామం లేదు ఏలూరులో హెచ్‌ఐవీ బాధిత చిన్నారులకు రిటైర్డ్ పోలీసు అధికారుల ఆపన్నహస్తం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 12:53 PM
34 వీక్షణలు

ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సేవా స్ఫూర్తితో నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల పంపిణీ

ఏలూరు: సుమారు నాలుగు దశాబ్దాల పాటు పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించిన అధికారులు పదవీ విరమణ అనంతరం కూడా అదే సేవాభావంతో సమాజానికి అండగా నిలవడం అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలకు మాత్రమే పదవీ విరమణ ఉంటుందని, ప్రజాసేవకు ఎప్పటికీ విరామం ఉండదని చాటిచెబుతూ ఏలూరు జిల్లా రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం సభ్యులు మానవీయ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, ఐపీఎస్ సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని శనివారం (22-11-2026) ఏలూరులోని రవితేజ చిల్డ్రన్ హోమ్‌లో నివసిస్తున్న హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌తో బాధపడుతున్న చిన్నారులకు తమ వ్యక్తిగత విరాళాలు, సహకారంతో నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలను అందజేశారు. కేవలం వస్తుసామగ్రిని అందించి వెళ్లిపోకుండా చిన్నారులతో కొంతసేపు ఆప్యాయంగా గడిపి, వారిలో ధైర్యం నింపుతూ ప్రేమాభిమానాలను పంచుకున్నారు. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం మానవత్వానికి అద్దం పట్టింది.

ఈ సందర్భంగా చిన్నారులకు 50 కేజీల బియ్యం, 16 కేజీల వంటనూనె డబ్బా, 10 కేజీల బంగాళాదుంపలు, 10 కేజీల క్యారెట్లు, 10 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల అల్లం, 2 కేజీల మిర్చి, 100 కోడిగుడ్లు, 10 కేజీల టమోటాలు, ఒక గెల అరటికాయలు, 4 కేజీల స్వీట్లు, ఒక గెల అరటిపండ్లను అందజేశారు. సంఘం సభ్యులు తమ సొంత నిధులతో సమకూర్చిన ఈ సహాయ సామగ్రి చిన్నారుల అవసరాలకు ఉపయోగపడనుంది.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు డీవీఎస్‌కే భగవాన్ రాజు, రిటైర్డ్ ఎస్పీ నక్క సూర్యచంద్రరావు, రిటైర్డ్ అదనపు ఎస్పీ కె. విజయపాల్, రిటైర్డ్ కమాండెంట్ ఎస్‌వీడీ ప్రసాద్, సంఘం కార్యదర్శి ఎస్. దాశరధి, కోశాధికారి ఎల్వీ సత్యనారాయణ, రిటైర్డ్ ఎస్ఐ బుద్దాల శ్రీనివాస్, ఆర్ఎస్ఐ మర్రి సత్యనారాయణ, రిటైర్డ్ ఎస్ఐ జి. నాగేశ్వరరావు, రిటైర్డ్ ఏఎస్ఐ జి.వి. సుబ్బారావు, రిటైర్డ్ ఏఎస్ఐ కె. ముత్తయ్య, రిటైర్డ్ ఎస్ఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రిటైర్డ్ పోలీసు అధికారులు మాట్లాడుతూ పోలీసు శాఖలో పనిచేసిన సమయంలో ప్రజలకు సేవలందించడాన్ని తమ బాధ్యతగా భావించామని, పదవీ విరమణ పొందిన తర్వాత కూడా సమాజానికి తమ వంతు సహకారం అందించాలనే సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజంలో ఆపన్న స్థితిలో ఉన్నవారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.

నాలుగు దశాబ్దాల ఉద్యోగ అనుభవంతో ప్రజలకు సేవలందించిన అధికారులు, పదవీ విరమణ తర్వాత కూడా సేవా కార్యక్రమాల ద్వారా తమ బాధ్యతను కొనసాగించడం ఆదర్శనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. పదవి, హోదా, ఉద్యోగం ముగిసినా సేవ చేయాలనే మనసుంటే జీవితాంతం సమాజానికి ఉపయోగపడవచ్చని రిటైర్డ్ పోలీసు అధికారులు తమ చేతలతో నిరూపించారు. చిన్నారులకు ఆహార భరోసాతో పాటు ఆత్మీయతను పంచిన ఈ కార్యక్రమం సేవాభావానికి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.