BREAKING
thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ
Date of Publish : 04 October 2026, 07:10 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరంలో అంగన్వాడీ ఉత్సవం పౌష్టికాహారంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Oct, 2026 - 07:10 AM
68 వీక్షణలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోలవరం గ్రామంలోని అంగన్వాడీ మెయిన్ కేంద్రంలో శనివారం పోషణ మాసం, అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ పర్యవేక్షకురాలు పి. గాయత్రీ దేవి పాల్గొని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, పోషకాహారం ప్రాధాన్యత గురించి వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. పోషణ మాసం, అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాలను ఈ నెల 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల ఆహార పదార్థాలతో ప్రత్యేక ప్రదర్శన శాలలను ఏర్పాటు చేసి, వాటి పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చాగంటి వాసుదేవ రావు, గడ్డం సంజీవరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు యర్రా ప్రసాదరావు, అంగన్వాడీ కార్యకర్తలు ఏ. జ్యోతి, ఎల్.ఎం. రాజేశ్వరి, కె. సరోజినీ బాయ్, ఏఎన్ఎం, అంగన్వాడీ సహాయకులు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.