BREAKING
thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ
Date of Publish : 04 October 2026, 07:10 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరంలో అటవీ భూముల ఆక్రమణ కలకలం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో చెట్లు నరికి భూముల స్వాధీనం.. అడ్డుకున్న అటవీ, పోలీసు అధికారులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Oct, 2026 - 07:10 AM
87 వీక్షణలు

రేంజర్ సత్యనారాయణపై అవినీతి ఆరోపణలు చేసిన టీడీపీ నాయకులు చిట్టిబాబు 

పోలవరం: ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోలవరంలో అటవీ భూముల ఆక్రమణ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. శనివారం టీడీపీ నాయకుడు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు) ఆధ్వర్యంలో వందలాది మంది పేదలు కత్తులు, గొడ్డళ్లతో అటవీ ప్రాంతానికి చేరుకుని తుప్పలు, పెద్దపెద్ద చెట్లను నరికి భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో అటవీశాఖ అధికారులు, పోలీసులకు స్థానికులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అటవీ భూముల ఆక్రమణను అడ్డుకునేందుకు అటవీశాఖ అధికారి సత్యనారాయణ, చాట్రాయి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెట్లను నరకవద్దని, అటవీ భూములను ఆక్రమించవద్దని అధికారులు హెచ్చరించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. గతంలో ఇదే ప్రాంతంలో అటవీ భూములను ఆక్రమించి సాగు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. భూముల ఆక్రమణ విషయంలో కొందరిపై చర్యలు తీసుకుంటూ, మరికొందరిని ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు) జోక్యం చేసుకుని అటవీశాఖ అధికారుల పనితీరుపై విమర్శలు చేశారు. గ్రామంలో కొందరు రైతులు గత రెండేళ్లలో తమ ఆధీనంలోని అటవీ భూముల విస్తీర్ణాన్ని పెంచుకున్నారని, రెండు ఎకరాలు సాగు చేస్తున్న వారు ఐదు ఎకరాలకు, మూడు ఎకరాలు సాగు చేస్తున్న వారు పది ఎకరాల వరకు భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అటువంటి ఆక్రమణలను అధికారులు ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు.

అటవీశాఖలో గతంలో డీఆర్‌ఓగా పనిచేసి ప్రస్తుతం రేంజర్‌గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణపై కూడా చిట్టిబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. మొక్కజొన్న పంట సాగుకు ఎకరానికి రూ.5 వేలు, బోరు వేయడానికి రూ.50 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు, అధికారిక నిర్ధారణ వివరాలు అందుబాటులో లేవు. సంబంధిత అధికారి వివరణ కూడా తెలియాల్సి ఉంది.

అటవీ భూముల్లో ఇప్పటికే సాగు చేస్తున్న వారు రేకుల షెడ్లు నిర్మించుకున్నారని, అటువంటి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేసినట్లు సమాచారం. లేనిపక్షంలో గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఒక్కో ఎకరం భూమిని సాగు చేసుకుంటామని, తమపై కేసులు నమోదు చేసినా ఎదుర్కొంటామని వారు హెచ్చరించినట్లు తెలిసింది. అటవీశాఖ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ ఆందోళనకారులను వెనక్కి పంపించలేకపోయారు.

ఈ కార్యక్రమంలో పోలవరం టీడీపీ అధ్యక్షుడు బిలుగూది జయరాజు, ఆర్. విజయరాజు, బిలుగూది చందు, కంపచాటి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

అటవీ భూముల పరిరక్షణ, ఆక్రమణలపై సమానంగా చర్యలు తీసుకోవడం, అధికారులపై వచ్చిన ఆరోపణలను విచారించడం వంటి అంశాలపై అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.