74 రోజుల తర్వాత పాపికొండల బోటింగ్ పునఃప్రారంభం
తెలంగాణ
/
భద్రాద్రి కొత్తగూడెం
పోలవరం: గోదావరిలో వరదల కారణంగా నిలిచిపోయిన పాపికొండల బోటింగ్ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. నేటి నుంచి బోట్ల రాకపోకలు పునఃప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.
గోదావరిలో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో పర్యాటక యాత్రకు అనుమతులు కల్పించినట్లు సమాచారం. పోలవరం పరిధిలోని దేవీపట్నం గండి పాయింట్ నుంచి పాపికొండల యాత్ర ప్రారంభం కానుంది.
వరదల నేపథ్యంలో జూలై 30న బోటింగ్ యాత్రను నిలిపివేశారు. తాజాగా పరిస్థితులు అనుకూలించడంతో 74 రోజుల విరామం తర్వాత యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. పర్యాటకులు ప్రయాణానికి ముందు బోటింగ్ నిర్వాహకులు, సంబంధిత అధికారుల నుంచి తాజా సమాచారం తెలుసుకోవాలని సూచిస్తున్నారు.