BREAKING
thumb ● ఆర్టీఐ రక్షక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ అడ్వైజర్‌గా హైకోర్టు న్యాయవాది గూడూరి వినోద్ కుమార్ నియామకం thumb ● కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంపై కాంగ్రెస్‌లో చర్చ.. thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● ఆర్టీఐ రక్షక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ అడ్వైజర్‌గా హైకోర్టు న్యాయవాది గూడూరి వినోద్ కుమార్ నియామకం thumb ● కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంపై కాంగ్రెస్‌లో చర్చ.. thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ
Test 4
Date of Publish : 29 November 2026, 08:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పర్వతాపురం గ్రామంలో వార్డు సభ్యులను కూడా సమకూర్చుకోలేని వ్యక్తికి సర్పంచ్ అభ్యర్థిత్వమా ఇదెక్కడి న్యాయం బూబత్తుల చెన్నారావు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Nov, 2026 - 08:46 AM
101 వీక్షణలు

వార్డు సభ్యుల విషయంలో కూడా ఏం చేయాలో జెడ్పీటీసీ శేఖర్ స్పష్టత ఇవ్వాలి బూబత్తుల చెన్నారావు 

పర్వతాపురంలో టీడీపీ అభ్యర్థి ఎంపికపై అసమ్మతి జ్వాలలు.. అడవి సత్యానికే సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలి

మంత్రి పార్థసారథికి బహుమతిగా అడవి సత్యం విజయాన్ని అందిస్తాం.. టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో ఉమ్మడి కూటమి బలపరిచే సర్పంచ్ అభ్యర్థి ఎంపిక వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో గ్రామంలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తన శక్తికి మించి కష్టపడి పనిచేసిన మిద్దె సత్యనారాయణ అలియాస్ అడవి సత్యానికి సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలనే నిర్ణయం గతంలోనే తీసుకున్నామని చాట్రాయి మండల తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు స్పష్టం చేశారు. ఆ సమయంలో అడవి సత్యం గ్రామంలో పార్టీ బలోపేతానికి, అభ్యర్థుల విజయానికి ఎంతో కృషి చేశారని, ఆయన సేవలను గుర్తించిన గ్రామ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి కూటమి బలపరిచే టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఆయన పేరును నిర్ణయించుకున్నామని తెలిపారు. అయితే ప్రస్తుతం అనూహ్యంగా కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత స్వార్థం, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ ముందుగా తీసుకున్న నిర్ణయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో ప్రజాబలం, కార్యకర్తల మద్దతు ఉన్న అడవి సత్యం పేరును పక్కనపెట్టి, గ్రామంలో నివాసం ఉండని ప్రజా బలం లేని మరో వ్యక్తి పేరును తెరపైకి తీసుకురావడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని చెన్నారావు విమర్శించారు. గ్రామంలో వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు కూడా తగిన అభ్యర్థులను సమకూర్చుకోలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ని ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ప్రకటించడం వెనుక అసలు కారణాలు ఏమిటీ ఈ విధంగా చేయడానికి కారణాలను మంత్రి పార్థసారథి విచారణ చేపట్టి నిజానిజాలు బయటకు తీయాలని బూబత్తుల చెన్నారావు కోరారు ఇటువంటి చర్యలు ద్వారా పార్టీకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందని ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ నిర్ణయాలను ప్రభావితం చేయడం, క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయడం సరైన విధానం కాదని అన్నారు. మరికొందరు వైసీపీ నాయకులతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారమంతా మంత్రి కొలుసు పార్థసారథికి సైతం పూర్తిస్థాయిలో తెలియకుండా, ఆయన అనుచరులుగా చెప్పుకునే కొంతమంది ద్వారా నడిపిస్తున్నారని విమర్శించారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేసి, వ్యక్తిగత లాభాల కోసం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అంటే పదవుల కోసం పనిచేసే కొంతమంది వ్యక్తుల సొంత వ్యవహారం కాదని, ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండాను మోస్తూ కష్టనష్టాలను ఎదుర్కొన్న కార్యకర్తల బలమే పార్టీకి పునాదని చెన్నారావు పేర్కొన్నారు. గ్రామంలో ప్రజలతో మమేకమై, పార్టీ కోసం పనిచేసిన అడవి సత్యానికి న్యాయం జరగాలని, అభ్యర్థి ఎంపికలో క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఎలాంటి వ్యక్తిగత స్వార్థానికి తలొగ్గకుండా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. పర్వతాపురం గ్రామంలో అడవి సత్యాన్ని సర్పంచ్‌గా గెలిపించుకుని మంత్రి కొలుసు పార్థసారథికి విజయాన్ని బహుమతిగా అందిస్తామని బూబత్తుల చెన్నారావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు దక్కే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

చాట్రాయి జెడ్పీటీసీ తేళ్లూరి శేఖర్ తనకు ఫోన్ చేసి పార్టీ అధిష్ఠానం సర్పంచ్ అభ్యర్థిగా బొర్రా రామకృష్ణ పేరును ఖరారు చేసిందని, తామంతా ఆయనకు మద్దతు తెలియజేయాలని సూచించినట్లు బూబత్తుల చెన్నారావు వెల్లడించారు. అధిష్ఠానం నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించకపోతే పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందని కూడా ఫోన్‌లో చెప్పినట్లు తెలిపారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోందని బూబత్తుల చెన్నారావు పేర్కొన్నారు. తేళ్లూరి శేఖర్ చెప్పినట్లు బొర్రా రామకృష్ణకు సర్పంచ్ అభ్యర్థిగా మద్దతు తెలియజేయడానికి సిద్ధపడితే, ఆయన తన వెంట వార్డు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకోలేదని గుర్తుచేశారు. మరి గ్రామంలో పోటీ చేస్తున్న వార్డు సభ్యుల పరిస్థితి ఏమిటి? బొర్రా రామకృష్ణకు మద్దతు తెలిపిన తర్వాత వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలి? ఏ ప్యానెల్‌కు అండగా నిలవాలి? అన్నది పార్టీ నాయకత్వం స్పష్టం చేయాలని బూబత్తుల చెన్నారావు ప్రశ్నించారు. సర్పంచ్ అభ్యర్థి విషయంలో అధిష్ఠానం నిర్ణయాన్ని అమలు చేయాలని చెబుతున్నప్పుడు, వార్డు సభ్యుల విషయంలో కూడా స్పష్టమైన నిర్ణయం ఉండాలి కదా, అడవి సత్యం ఏర్పాటు చేసిన ప్యానెల్ కు మద్దతు ఇవ్వాలా లేక నోటాకు ఓటువేసి వైయస్సార్ సిపి ప్యానెల్ అభ్యర్థులను ఏకగ్రీవం చేయాలా అని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు పార్టీ క్రమశిక్షణ పేరుతో మద్దతు కోరుతూ, మరోవైపు వార్డు సభ్యుల విషయంలో స్పష్టత లేకుండా ఎలా ముందుకు వెళ్లాలని ఆయన నిలదీశారు. సర్పంచ్ అభ్యర్థి ఎంపికతో పాటు వార్డు సభ్యుల ప్యానెల్ విషయంలోనూ శేఖర్ స్పష్టత ఇవ్వాలని బూబత్తుల చెన్నారావు కోరారు. ప్రజాబలంలేని వ్యక్తికి తానొక్కడు మద్దతిస్తే గెలవడని విజయం సాధించాలంటే ప్రజాబలం కావాలని స్పష్టం చేశారు  ఈవ్యవహారం పర్వతాపురం టీడీపీ శ్రేణుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.