BREAKING
thumb ● కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంపై కాంగ్రెస్‌లో చర్చ.. thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంపై కాంగ్రెస్‌లో చర్చ.. thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు
Test 4
Date of Publish : 29 November 2026, 06:54 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అన్నమయ్య జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
29 Nov, 2026 - 06:54 AM
12 వీక్షణలు

మదనపల్లె, అన్నమయ్య జిల్లా: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లాలోని 10 మండలాల పరిధిలో మొత్తం 149 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

రెండో విడత ఎన్నికల్లో పీలేరు డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో 81 గ్రామ పంచాయతీలకు, పుంగనూరు డివిజన్ పరిధిలోని 4 మండలాల్లో 68 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.

బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి అధికారులు విధులపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని, తమకు కేటాయించిన ప్రాంతాల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులకు పటిష్ట భద్రత కల్పిస్తూ పోలీసు బలగాలు పోలింగ్ కేంద్రాలకు బయలుదేరాయి.

సీఐలు, ఎస్‌ఐల పర్యవేక్షణలో సివిల్ పోలీసులతో పాటు ఏఆర్, ఏపీఎస్పీ, స్పెషల్ పార్టీ సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా పోలీసు అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూడాలని కోరింది.