BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 11:58 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పర్వతపురం పంచాయతీపై కూటమి గురి.. సర్పంచ్ బరిలో అడవి సత్యం! బూరుగుగూడెం ఎంపీటీసీ గెలుపు జోష్‌తో పర్వతపురంలోనూ పాగా వేస్తాం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 11:58 AM
185 వీక్షణలు

మంత్రి కొలుసు పార్థసారథికి పంచాయతీ విజయాన్ని కానుకగా అందిస్తాం కూటమి అభివృద్ధి, సంక్షేమ పథకాలే మా విజయానికి బలమైన పునాది: మిద్దె సత్యనారాయణ

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం పర్వతపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ వేడి మొదలైంది. సర్పంచ్ ఎన్నికల బరిలో కూటమి అభ్యర్థిగా మిద్దె సత్యనారాయణ అలియాస్ అడవి సత్యం నామినేషన్ దాఖలు చేయడంతో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల కూటమి నాయకులు బలపరిచిన ఆయన శనివారం నాయకులు, కార్యకర్తల సమక్షంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా అడవి సత్యం మాట్లాడుతూ బూరుగుగూడెం ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమికి లభించిన విజయం ఇచ్చిన ఉత్సాహంతో పర్వతపురం పంచాయతీలోనూ ప్రజల మద్దతుతో విజయం సాధించేందుకు ముందుకు సాగుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. బూరుగుగూడెంలో సాధించిన విజయాన్ని పర్వతపురంలోనూ పునరావృతం చేసి గ్రామ పంచాయతీని కూటమి ఖాతాలో వేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ విజయాన్ని గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి కానుకగా అందిస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమకు ప్రజల్లో ఉన్న ఆదరణకు కొలమానమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలకే పరిమితం కాకుండా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడం తమ కార్యాచరణలో ప్రధాన అంశాలని వివరించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. గ్రామ అభివృద్ధికి తమకు ఒక అవకాశం కల్పించాలని, ఓటు ద్వారా ఆశీర్వదించి సర్పంచ్‌గా గెలిపించాలని అభ్యర్థించారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతూ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్వతపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం నేతలు బూబత్తుల చెన్నారావు, బయగాని మల్లిఖార్జున రావు, మిద్దె మురళి,జనసేన నాయకులు అనిల్ తదితరులు పాల్గొన్నారు

.