BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 03:50 pm
Posted by : RAMU JAJU

బాల్యవివాహాల నిర్మూలనకు తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి

తెలంగాణ
/ నిజామాబాద్ / నందిపేట్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
27 Nov, 2026 - 03:50 PM
45 వీక్షణలు

గాదేపల్లి, నవంబర్ 27: బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై పడే ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు దొంకేశ్వర్ మండలం గాదేపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం తల్లుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినుల తల్లులు పాల్గొనగా, బాల్యవివాహాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంపై ఉందని వక్తలు వివరించారు.


ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. బాలికలకు చట్టబద్ధమైన వివాహ వయస్సు రాకముందే వివాహాలు చేయడం వల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే ప్రమాదం ఉందని తెలిపారు. చిన్న వయస్సులో వివాహం చేయడం వల్ల బాలికల విద్యకు ఆటంకం కలగడమే కాకుండా, వారి ఆశయాలు, లక్ష్యాలు దెబ్బతినే అవకాశం ఉందని వివరించారు. బాలికలకు విద్య అందించి, స్వతంత్రంగా తమ భవిష్యత్తును నిర్మించుకునే అవకాశాలు కల్పించాలని సూచించారు.

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆడపిల్లలను భారంగా భావించకుండా వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. బాల్యవివాహాలు వ్యక్తిగతంగా ఒక బాలిక జీవితానికే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా ఆటంకంగా మారుతాయని వివరించారు. బాల్యవివాహాల నివారణకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వారికి మంచి భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బాల్యవివాహాలపై అవగాహన పెంపొందించడం ద్వారా వాటిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు సూచించారు.

ఈ అవగాహన సదస్సులో గ్రామ సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి, ఉపసర్పంచ్ సందీప్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేశ్వర్, ఉపాధ్యాయుడు నాగరాజ్, ప్రీ-ప్రైమరీ హెచ్ఎం రాజన్న, అంగన్వాడీ టీచర్ కళావతి, ఆయా శైలజ, విద్యార్థినులు, వారి తల్లులు పాల్గొన్నారు.

NTODAY NEWS | ప్రతి క్షణం ప్రజల పక్షం