మంచిర్యాల ఎమ్మెల్యేను కలిసిన 15వ డివిజన్ ప్రజలు
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్‌కు చెందిన కార్పొరేటర్ చింతపండు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గోనే సంజీవ్ రావు, డివిజన్ ప్రజలు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా డివిజన్‌లో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.. సంబంధిత అంశాలను పరిశీలించి త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కార్పొరేటర్ పెంట రజిత, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.