BREAKING
thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
Test 4
Date of Publish : 25 November 2026, 08:16 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్నికల విధుల్లో సేవలందించిన విద్యార్థులకు పోలీసుల అభినందన..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 08:16 AM
28 వీక్షణలు

విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేత

కైకలూరు: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో బాధ్యతాయుతంగా సేవలందించిన విద్యార్థినీ విద్యార్థులను పోలీసు అధికారులు అభినందించారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లుగా పాల్గొని, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు తమవంతు సహకారం అందించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేసి వారి సేవలను గుర్తించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్ ఆధ్వర్యంలో ఈ అభినందన కార్యక్రమం నిర్వహించారు. వికాస్ కళాశాలకు చెందిన 30 మంది విద్యార్థినీ విద్యార్థులు ఎన్నికల విధుల్లో వాలంటీర్లుగా సేవలందించగా, వారి క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతాయుతమైన పనితీరును అధికారులు ప్రత్యేకంగా ప్రశంసించారు. అదేవిధంగా రూరల్ ఎస్ఐ రాంబాబు ఆధ్వర్యంలో ఆకివీడు విద్యావికాస్ డిగ్రీ కళాశాలకు చెందిన 20 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎన్నికల సమయంలో పోలీసు సిబ్బందికి సహకరిస్తూ, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలకమని, వాటి నిర్వహణలో విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలందించడం అభినందనీయమన్నారు. యువతలో సామాజిక బాధ్యత, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో భాగస్వాములై విజయవంతమైన నిర్వహణకు సహకరించిన విద్యార్థులను ఈ సందర్భంగా అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండవల్లి ఎస్ఐ సీహెచ్. రామచంద్రరావు, వికాస్ కళాశాల ప్రిన్సిపాల్ టి. వెంకటేశ్వర్లు, కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.