BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 06:51 pm
Posted by : K MAHESH

గుడుంబా తయారీపై పోలీసుల ఉక్కుపాదం

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 06:51 PM
17 వీక్షణలు

చెరువుముంతు, బోడమంచ తండాల్లో కార్డన్ అండ్ సెర్చ్ తనిఖీలు

4 వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.. 50 లీటర్ల నాటుసారా స్వాధీనం

కేసముద్రం, నవంబర్ 21:

అక్రమంగా గుడుంబా, నాటుసారా తయారీ, నిల్వ, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శనివారం ఉదయం కేసముద్రం మండల పరిధిలోని చెరువుముంతు తండా, బోడమంచ తండాల్లో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడంతో పాటు నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.

శనివారం ఉదయం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు రెండు గంటల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి. కేసముద్రం, నెల్లికుదురు, ఇనుగుర్తి పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సర్కిల్ పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తండాల్లోని పలు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి అక్రమంగా నాటుసారా తయారీ, నిల్వ, రవాణా జరుగుతున్న ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా సుమారు 4,000 లీటర్ల బెల్లం పానకాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. అలాగే 50 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. తండాల్లో రాకపోకలు సాగిస్తున్న 50 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి, వాటికి సంబంధించిన రికార్డులు, ధ్రువపత్రాలను పరిశీలించారు.

తండావాసులకు పలు అంశాలపై అవగాహన

తనిఖీల అనంతరం పోలీసులు తండావాసులతో మాట్లాడి పలు అంశాలపై అవగాహన కల్పించారు. గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, పోక్సో చట్టం, బాల్యవివాహాల నిరోధం వంటి అంశాలను వివరించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అక్రమ నాటుసారా తయారీదారులపై కేసులు

ఈ సందర్భంగా కేసముద్రం సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ.. అక్రమ నాటుసారా తయారీ, విక్రయాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాల నియంత్రణతో పాటు ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు పోలీసుల తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.