BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 02:46 pm
Posted by : K MAHESH

ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి ప్రాధాన్యత: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

తెలంగాణ
/ హన్మకొండ / కాజీపేట
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 02:46 PM
23 వీక్షణలు
  • కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.20 లక్షలతో నిర్మించిన సెమినార్ హాల్ ప్రారంభం

  • విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి సమాజానికి సేవ చేయాలి: ఎంపీ కడియం కావ్య

హనుమకొండ (ఎన్ టుడే న్యూస్): ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, ఆధునిక సదుపాయాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సెమినార్ హాల్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముందు సెమినార్ హాల్ ఎదుట ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలనతో సెమినార్ హాల్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడం, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు. అదనపు తరగతి గదులు, విద్యార్థినుల హాస్టల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

వరంగల్ విద్యారంగ అభివృద్ధి కోసం ఎంపీ కడియం కావ్యతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన నిధులు, అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించి పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

అనంతరం ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు వారికి నాణ్యమైన విద్య అందించడం ముఖ్యమని అన్నారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులతో పాటు వివిధ కారణాలతో చదువుకు దూరంగా ఉన్న యువత అవసరాలను కూడా గుర్తించాలని సూచించారు. విద్యార్థులందరినీ తమ పిల్లలుగా భావించి వారి భవిష్యత్తు కోసం ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కాకతీయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఇతర విద్యాసంస్థల అభివృద్ధి కోసం పార్లమెంట్‌లో ప్రస్తావిస్తున్నానని తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయానికి పీఎం ఉషా, రూసా వంటి పథకాల కింద మరిన్ని నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. విద్యాసంస్థలకు అవసరమైన నిధులు, పరిశోధన సదుపాయాలు, మౌలిక వసతుల కల్పనపై విద్యార్థులు, అధ్యాపకులు తమ అవసరాలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

విద్యార్థులు చదువుతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని ఎంపీ కడియం కావ్య సూచించారు. ఒత్తిడి, నిరాశ వంటి సమస్యలు ఎదురైనప్పుడు వైద్యులను సంప్రదించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. సోషల్ మీడియా ప్రభావంతో విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకున్న విద్యార్థులు సమాజానికి తిరిగి తమ వంతు సేవ చేయాలని పిలుపునిచ్చారు. డబ్బుతోనే కాకుండా తమ అనుభవాన్ని, సమయాన్ని పేద విద్యార్థులకు అందించడం ద్వారా కూడా సమాజానికి సేవ చేయవచ్చని పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.