BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 06:51 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో రామోజీరావు జయంతి జీవోపై నిరసన..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 06:51 AM
128 వీక్షణలు

 రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి

ప్రజాధనంతో వ్యాపారవేత్త జయంతి ఉత్సవాలా.. ప్రజల కోసం పోరాడిన మహనీయులు గుర్తుకు రారా

సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ డిమాండ్

విస్సన్నపేట: రామోజీరావు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నవంబర్ 16న రామోజీరావు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం సరికాదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవాల్సిన ప్రభుత్వం ఒక వ్యాపారవేత్త జయంతిని రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని విమర్శించారు.

ప్రజల సమస్యలు, ప్రభుత్వ విధానాలు, సామాజిక అన్యాయాలను వెలుగులోకి తీసుకురావాల్సిన పత్రికా రంగం నాలుగో స్తంభంగా నిలవాల్సి ఉండగా, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే స్థాయికి దిగజార్చే ధోరణులు ప్రజాస్వామ్యానికి మంచివి కావని హరినాథ్ పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛ, నిష్పాక్షిక జర్నలిజం విలువలను కాపాడేందుకు అభ్యుదయ, ప్రగతిశీల శక్తులతో పాటు నిబద్ధత కలిగిన జర్నలిస్టులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 243ను వెంటనే రద్దు చేయాలని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలోని బొల్లారంలో పేదల భూముల విషయంలో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి సంబంధించి వివాదాలను ప్రస్తావిస్తూ, ఆ భూములపై ఉన్న ఆరోపణలు, అభ్యంతరాలను పరిశీలించి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. భూములు అర్హులైన పేదలకు తిరిగి అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల కంటే వ్యక్తుల ప్రాధాన్యతకు పెద్దపీట వేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని హరినాథ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.