BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 12 August 2026, 11:30 am
Posted by : RAYI SREENIVASU

రైతులు గడువులోగా పంట బీమా నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Rayi sreenivasu నెల్లిమర్ల నియోజకవర్గ ప్రతినిధి
12 Aug, 2026 - 11:30 AM
42 వీక్షణలు

రైతులు గడువులోగా పంట బీమా నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్

విజయనగరం: విజయనగరం జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో సాగు చేస్తున్న పంటలకు పంట బీమా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి సూచించారు. ఎల్ నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో, రైతులు పంట బీమా చేసుకోవడంపై దృష్టి సారించాలని తెలిపారు.

పంటలకు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం వాటిల్లినప్పుడు రైతులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు పంట బీమా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అధిక వర్షాలు, కరువు, తుఫానులు తదితర కారణాలతో పంట నష్టం జరిగితే పంట బీమా పథకం ద్వారా పరిహారం పొందేందుకు రైతులు గడువులోగా నమోదు చేసుకోవాలని తెలిపారు.
జిల్లాలో ఇప్పటివరకు 15,600 హెక్టార్లకు పంట బీమా నమోదు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన రైతులు కూడా ఆగస్టు 15లోగా పంట బీమా నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.