జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
జిల్లా ఎస్పీ నుండి ప్రశంసా పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
యాదాద్రి జిల్లా: రామన్నపేట: ; అక్టోబర్ 13
రామన్నపేట మండల పోలీస్ aస్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న పలు వరుస దొంగతనాల కేసులను అత్యంత చాకచక్యంగా ఛేదించి, నిందితులను అరెస్ట్ చేసిన రామన్నపేట ఎస్సై గోపతి సతీష్ ని మరియు వారి బృందాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
స్టేషన్ పరిధిలో జరిగిన బంగారం దొంగతనం, రాగి తీగల రాబరీ, మరియు మేకల దొంగతనాలకు సంబంధించిన వివిధ కేసులలో వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను గుర్తించి పట్టుకోవడంలో రామన్నపేట పోలీసులు కీలక పాత్ర పోషించారు. పోలీసుల సమర్థవంతమైన పనితీరును, చాకచక్యాన్ని గుర్తిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్స్ యాదవ్ ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ నుండి ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో రామన్నపేట ఎస్సై జి సతీష్ తో పాటు వారి సిబ్బంది అయిన ప్రశాంత్, ప్రవీణ్, సురేష్, సత్యం మరియు ఇతర స్టేషన్ సిబ్బంది ఉన్నారు.
ప్రజల ఆస్తిపాస్తుల రక్షణే ధ్యేయంగా, నేరాల అదుపునకు నిరంతరం శ్రమిస్తున్న రామన్నపేట పోలీసు బృందాన్ని ఈ సందర్భంగా పలువురు అధికారులు, స్థానిక ప్రజలు కొనియాడారు. నేరస్థులపై కఠిన చర్యలు కొనసాగుతాయని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని ఈ సందర్భంగా పోలీస్ అధికారులు తెలిపారు.