BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 09:00 pm
Posted by : SEETHA KIRAN KUMAR

లొంగిపోయిన మాజీ నక్సల్స్‌కు పునరావాస ప్రయోజనాలు త్వరితగతిన అందించాలి

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
26 Nov, 2026 - 09:00 PM
15 వీక్షణలు

11 మందికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సమీక్ష

హనుమకొండ: నవంబర్ 26:

ప్రభుత్వానికి లొంగిపోయిన మాజీ నక్సల్స్‌కు పునరావాస పథకం కింద ప్రకటించిన ప్రయోజనాలను సమర్థవంతంగా అందించి, వారికి మెరుగైన జీవనోపాధి కల్పించే దిశగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆధ్వర్యంలో గురువారం వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా పరిధిలో పునరావాసానికి అర్హులైన 11 మంది లొంగిపోయిన మాజీ నక్సల్స్‌కు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై ప్రధానంగా చర్చించారు. అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అనువైన ప్రభుత్వ భూములను గుర్తించాలని కలెక్టర్, పోలీస్ కమిషనర్ సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించి, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

సంక్షేమ పథకాల అమలుకు సమన్వయం

పునరావాస లబ్ధిదారులకు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పునరావాస ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, డీఆర్డీవో మేన శ్రీను, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ నాయక్, ఆర్ అండ్ బీ ఈఈ దేవిక చౌహాన్, ఏసీపీ జానీ నరసింహులు, పలువురు తహసీల్దార్లు, పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.