BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 09:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి మండలంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు.. వైసీపీ, టీడీపీ చెరో 8 స్థానాల్లో విజయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Nov, 2026 - 09:42 PM
16 వీక్షణలు

 ఏలూరు జిల్లా, చింతలపూడి: మండలంలో జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ఇరు పార్టీల మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు సమానంగా విజయాలు సాధించారు. మొత్తం 18 గ్రామ పంచాయతీలకు గాను 16 గ్రామాల్లో ఫలితాలు వెల్లడికాగా, వైసీపీ మద్దతుదారులు 8 గ్రామాల్లో, టీడీపీ మద్దతుదారులు మరో 8 గ్రామాల్లో విజయం సాధించారు. టీడీపీ మద్దతుతో రేచర్ల, సీతానగరం, లింగగూడెం, గణిజర్ల, నామవరం, శివాపురం, పోతునూరు, మల్లయ్యగూడెం గ్రామాల అభ్యర్థులు గెలుపొందారు. వైసీపీ మద్దతుతో ఎర్రగుంటపల్లి, ఊటసముద్రం, చింతంపల్లి, వెంకటాపురం, వెంకటాద్రిగూడెం, ఎండపల్లి, తిమ్మిరెడ్డిపల్లి, ఎర్రంపల్లి గ్రామాల అభ్యర్థులు విజయం సాధించారు. మరో రెండు గ్రామాలైన ప్రగడవరం, రాఘవాపురంలో ఫలితాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో చింతలపూడి మండలంలో ఇరు పార్టీల మధ్య సమాన ఆధిపత్యం కనిపిస్తోంది. మిగిలిన రెండు గ్రామాల ఫలితాలు వెలువడితే మండలంలోని సర్పంచ్ ఎన్నికల పూర్తి ఫలితాలపై స్పష్టత రానుంది. గ్రామాల్లో గెలుపొందిన అభ్యర్థుల అనుచరులు సంబరాలు చేసుకుంటుండగా, రాజకీయ వర్గాల్లో ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.