BREAKING
thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ
Date of Publish : 07 October 2026, 09:37 pm
Posted by : KOLA MAHESH

రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి

తెలంగాణ
/ నల్గొండ / మునుగోడు
Reporter
Kola Mahesh Munugodu Constituency
07 Oct, 2026 - 09:37 PM
6 వీక్షణలు

రామన్నపేట: రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు చేయడంతో పాటు కోర్టుకు అవసరమైన సిబ్బంది, కోర్టు పరిధిని మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించారు. సీనియర్ న్యాయవాది జినుకుల ప్రభాకర్ ఆధ్వర్యంలో నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం నేతృత్వంలో ఈ వినతిపత్రాన్ని అందజేశారు.

రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ప్రజలకు న్యాయ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని, న్యాయపరమైన వ్యవహారాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని ప్రతినిధులు వివరించారు. కోర్టు ఏర్పాటుకు అవసరమైన సిబ్బంది, కోర్టు పరిధి మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన భట్టి విక్రమార్క కోర్టుకు సంబంధించిన ఫైలును పరిశీలించి, ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కోర్టు ఏర్పాటు పూర్తయ్యే వరకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలకు సహకరిస్తామని పేర్కొన్నారు.

అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవ తీసుకోవడంపై స్థానిక న్యాయవాదులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న జగన్మోహన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు పూస బాలకిషన్, గుత్త నరసింహారెడ్డి, పిట్ట వెంకట్ రెడ్డి, రామిని రమేష్, శంబాల వెంకటేషం, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.