BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 October 2026, 10:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రేవంత్ డిఫెన్స్ స్కూల్ విద్యార్థుల సత్తా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Oct, 2026 - 10:25 PM
10 వీక్షణలు

ఎన్‌టీఆర్ జిల్లా, తిరువూరు: రాజమహేంద్రవరంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో తిరువూరులోని రేవంత్ డిఫెన్స్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు.

రాజమహేంద్రవరం లలితనగర్‌లోని శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన పోటీల్లో అండర్-16 బాలికల కుమ్మిటే ఫైట్ విభాగంలో కొంగల జెస్సి ప్రథమ స్థానం సాధించింది. అండర్-14 బాలుర కుమ్మిటే ఫైట్ విభాగంలో కొంగల యశ్వంత్, తోకా భార్గవ్ కుమార్ ప్రథమ స్థానంలో నిలిచారు. అండర్-14 బాలుర కటా విభాగంలో కందుల చరణ్ ప్రథమ స్థానం సాధించాడు.

సబ్ జూనియర్స్ బాలికల కటా విభాగంలో ఎం. ఆద్య, జూనియర్ బాలికల విభాగంలో మట్టగుంజ రిత్విక, రెబ్బు గంగా వైష్ణవి ప్రథమ స్థానాలు సాధించారు. జూనియర్ బాలుర విభాగంలో ఆర్. ఉమాసాయి విక్షిత్, కొన్నే అభయ్ ద్వితీయ స్థానాల్లో నిలిచారు.

విద్యార్థుల విజయాల సందర్భంగా గురువారం పాఠశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, పట్టణ ప్రముఖులు విజేతలను అభినందించారు. ఉత్తమ శిక్షణ అందించిన కోచ్ మరకాల రేవంత్, లేడీ ట్రైనీ సంధ్యను కూడా అభినందించారు.

ఈ సందర్భంగా కోచ్ రేవంత్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించేలా విద్యార్థులకు శిక్షణ అందిస్తూ, మరెందరో ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దుతానని తెలిపారు.