BREAKING
thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం
Date of Publish : 04 October 2026, 07:13 am
Posted by : ఈడూరి డేవిడ్

యర్నగూడెం బాలికల వసతి గృహంలో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
04 Oct, 2026 - 07:13 AM
12 వీక్షణలు

దేవరపల్లి: మండలంలోని యర్నగూడెం గ్రామంలో సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 3F OIL కంపెనీ సౌజన్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు ప్రారంభించారు. కూటమి నాయకులతో కలిసి ఆయన ప్లాంట్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థినులకు స్వచ్ఛమైన, శుద్ధి చేసిన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో 3F OIL కంపెనీ ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

విద్యాసంస్థల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చేస్తున్న కృషికి స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం, అవసరమైన సదుపాయాలు కల్పించడం ముఖ్యమని పేర్కొన్నారు.

ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన 3F OIL కంపెనీ యాజమాన్యానికి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో కూటమి నాయకులు, వసతి గృహ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.