మోపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. ఫోటో ఫ్రేమ్ షాప్ నిర్వాహకుడు మృతి
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
పామూరు
పామూరు: మండలంలోని మోపాడు వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తూర్పు కట్టకిందపల్లికి చెందిన నీరుకట్టు హరీష్ (33) ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం.
హరీష్ పామూరు పట్టణంలోని కందుకూరు రోడ్డులో ఫోటో ఫ్రేమ్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి షాప్‌లో పని ముగించుకుని బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. మోపాడు సమీపంలోకి చేరుకున్న సమయంలో బైక్‌ను ట్రాక్టర్ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదంలో హరీష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.