BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 02:50 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మునుగోడు యువకుడు మృతి

తెలంగాణ
/ నల్గొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
21 Nov, 2026 - 02:50 PM
15 వీక్షణలు

వారం రోజుల క్రితమే ఉద్యోగం సాధించిన సాయితేజ (25) దుర్మరణం.. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు

మునుగోడు: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన మునుగోడు పట్టణానికి చెందిన సాయితేజ (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వారం రోజుల క్రితమే ఉద్యోగం సాధించి, కొత్త జీవితాన్ని ప్రారంభించే సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

అందిన సమాచారం ప్రకారం.. సాయితేజ కారులో ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో జింక అడ్డుగా రావడంతో దానిని ఢీకొట్టి కారు ఆగిపోయింది. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన వాహనాలు సాయితేజ కారును ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

వారం రోజుల క్రితమే ఉద్యోగం సాధించానని సంతోషంగా చెప్పిన కుమారుడు ఇంతలోనే విగతజీవిగా మారాడన్న వార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన మునుగోడులో విషాదాన్ని నింపింది.