BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 07:01 pm
Posted by : K MAHESH

మత్స్య సహకార సంఘాల అభివృద్ధికి రూ.1,000 కోట్లు కేటాయించాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 07:01 PM
13 వీక్షణలు

ముదిరాజుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పెన్షన్, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి: బండారి మల్లయ్య

నెల్లికుదురు, నవంబర్ 21:

రాష్ట్రంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించి ముదిరాజుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని ఎర్రబెల్లిగూడెం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు బండారి మల్లయ్య కోరారు. మత్స్యకారుల సంక్షేమం, ముదిరాజుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రపంచ మత్స్య సహకార దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లిగూడెం గ్రామంలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో ముదిరాజ్ మహాసభ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం గ్రామ అధ్యక్షుడు బండారి మల్లయ్య మహాసభ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ముదిరాజులను బీసీ-ఏ జాబితాలో చేర్చి విద్య, ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు నామినేటెడ్ పదవుల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మత్స్యకారుల జీవనోపాధికి భరోసా కల్పించేలా 50 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారునికి పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే నిరుపేద మత్స్యకార కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ముదిరాజుల సంక్షేమం, ఐక్యత కోసం కమ్యూనిటీ భవనాలు నిర్మించేందుకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు ముదిరాజుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మత్స్య సహకార సంఘాల బలోపేతానికి నిధులు కేటాయించడంతో పాటు మత్స్యకారులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని అన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు భూముల ఉప్పలయ్య, వార్డు సభ్యుడు బండారి యాకయ్య, మాజీ వార్డు సభ్యుడు బండారి ఉప్పలయ్య, ముదిరాజ్ మహాసభ నాయకులు గుంటుక వెంకన్న, బండారి రాములు, చొప్పరి కృష్ణ, యాటకాని శ్రీను, చెన్నబోయిన వెంకన్న, నారబోయిన మల్లేష్, బండారి హరికృష్ణ, రాజబోయిన రామ్మూర్తి, యాటకాని సారయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.