BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 06:29 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాజంపేట పాత బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 06:29 AM
24 వీక్షణలు

వృద్ధురాలి కాలుపై నుంచి వెళ్లిన వెనుక టైరు

కడప జిల్లా: రాజంపేట పాత బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. కడపకు వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బస్సు వెనుక చక్రం కింద పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెనగలూరు మండలం బుడ్డరెడ్డిగారిపల్లెకు చెందిన రసూల్ బీ (65) రాజంపేట పాత బస్టాండ్‌లో కడప వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె కాలుజారి బస్సు వెనుక టైరు కింద పడిపోయారు. దీంతో బస్సు వెనుక టైరు ఆమె ఎడమ కాలు మీదుగా వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. తీవ్ర రక్తగాయాలతో బాధపడుతున్న వృద్ధురాలిని స్థానికులు వెంటనే ఆదుకుని 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు ఎక్కే సమయంలో జరిగిన ఈ ప్రమాదం ప్రయాణికుల్లో కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.