BREAKING
thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ
Date of Publish : 13 October 2026, 04:18 pm
Posted by : PAGADALA DEVAIAH

శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లకు నెట్ డేటాతో కూడిన ట్యాబ్‌లు మంజూరు చేయాలి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
13 Oct, 2026 - 04:18 PM
26 వీక్షణలు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లో పనిచేస్తున్న శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు నమోదు కోసం నెట్ డేటాతో కూడిన ట్యాబ్‌లు మంజూరు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రాన్ని అందజేసింది.

ఈ సందర్భంగా సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు జి. రాములు మాట్లాడుతూ, జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 900 మంది శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారని తెలిపారు. ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్ పరిధిలో మూడు గ్రూపుల చొప్పున మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

కార్మికుల హాజరును ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు, 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు మూడు విడతలుగా మొబైల్ ఫోన్ల ద్వారా నమోదు చేయాల్సి వస్తోందని వివరించారు. ఇందుకోసం ఫీల్డ్ అసిస్టెంట్లు తమ వ్యక్తిగత మొబైల్ ఫోన్లలోని ఇంటర్నెట్ డేటాను వినియోగించాల్సి వస్తోందని తెలిపారు. హాజరు నమోదు సరిగా పూర్తయితేనే కార్మికులకు నెలవారీ వేతనాలు అందుతాయని పేర్కొన్నారు.

అయితే, ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో బయోమెట్రిక్ హాజరు నమోదు చేసినప్పటికీ, కొన్నిసార్లు అది సిస్టమ్‌లో నమోదుకాకపోవడం లేదా తర్వాత తొలగిపోవడం జరుగుతోందని రాములు తెలిపారు. దీంతో విధులకు హాజరైన కార్మికులకు కూడా హాజరు గైర్హాజరుగా నమోదై, నెలకు రెండు మూడు రోజుల వేతనం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికులకు నిర్ణయించిన వేతనం రూ.15,200 ఉన్నప్పటికీ, హాజరు సమస్యల కారణంగా పలువురికి నెలకు రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు మాత్రమే అందుతున్నాయని తెలిపారు. ఈ సమస్యతో ఫీల్డ్ అసిస్టెంట్లు, పర్యవేక్షకులు, పారిశుద్ధ్య కార్మికుల మధ్య విభేదాలు ఏర్పడి ఇబ్బందులకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ సమస్యకు పరిష్కారంగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు నమోదు చేసేందుకు అవసరమైన ఇంటర్నెట్ డేటాతో కూడిన ట్యాబ్‌లను శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లకు మంజూరు చేయాలని సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ అంబర్‌పేట జోన్ కమిటీ సభ్యుడు ఈ. శ్రీనివాస్ పాల్గొన్నారు.