BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 06:32 pm
Posted by : K MAHESH

ఇంటింటికీ వెళ్లి ఇందిరమ్మ బీమాపై అవగాహన కల్పించిన సర్పంచ్ ప్రవీణ్ నాయక్

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 06:32 PM
17 వీక్షణలు

అర్హులైన ప్రతి కుటుంబం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. గ్రామపంచాయతీ పరిధిలోనే ఆన్‌లైన్ దరఖాస్తు సౌకర్యం

బయ్యారం, నవంబర్ 21: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలనే లక్ష్యంతో గంధంపల్లి–కొత్తపేట గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ ప్రజల్లోకి వెళ్లి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించారు. పథకం ఉద్దేశం, అర్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలియజేస్తూ అర్హులైన కుటుంబాలన్నీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన ఉద్దేశమని వివరించారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి మరణించినప్పుడు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను కొంతమేర తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. అందువల్ల అర్హత కలిగిన ప్రతి కుటుంబం పథకంలో నమోదు చేసుకోవాలని సూచించారు.

ప్రజలు దరఖాస్తుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా గ్రామపంచాయతీ పరిధిలోనే ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన కుటుంబాలు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.

అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను కూడా తెలియజేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడి ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు, అవసరాలను తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూలకంటి సీతారాం రెడ్డి, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.