BREAKING
thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం
Date of Publish : 13 October 2026, 03:43 pm
Posted by : PAGADALA DEVAIAH

మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
13 Oct, 2026 - 03:43 PM
17 వీక్షణలు

▪️ వృద్ధులకు అన్నదానం.. బెడ్‌షీట్లు, నిత్యావసర సరుకుల పంపిణీ

▪️ వనస్థలిపురం వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం

హైదరాబాద్ (వనస్థలిపురం): శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి జన్మదినాన్ని పురస్కరించుకుని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శివప్రకాష్ ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని ఓ వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేయడంతో పాటు బెడ్‌షీట్లు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ద్వారా సమాజంలో మానవత్వం, సేవాభావం మరింత పెంపొందుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా శివప్రకాష్ మాట్లాడుతూ.. సిరికొండ మధుసూదనాచారి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన చేపట్టే ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకున్నారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యువజన నాయకులు నవీన్, రాకేష్, వినయ్ కుమార్, రవి యాదవ్, సాయి యాదవ్, కళ్యాణ్, రాజ్, లక్కీ గౌడ్, శరత్, కౌశిక్, వంశీ, మజీద్, నవీన్ కుమార్, పవన్, నరేష్, ఆసిఫ్, ప్రవీణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.