BREAKING
thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి
Date of Publish : 07 October 2026, 06:47 pm
Posted by : NTODAY NEWS

ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
07 Oct, 2026 - 06:47 PM
2 వీక్షణలు

అక్టోబర్‌ 8న ‘చలో రాజ్‌భవన్‌’ను జయప్రదం చేయాలని పిలుపు


సైదాబాద్‌, అక్టోబర్‌ 7 (ఎన్‌టుడే న్యూస్‌): ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలని, ఎన్నికల కమిషనర్‌ గణేష్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 8న నిర్వహించనున్న ‘చలో రాజ్‌భవన్‌’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ, కాంగ్రెస్‌ తదితర పార్టీల నాయకులు పిలుపునిచ్చారు.

ఈ మేరకు సింగరేణి కాలనీ గిరిజన సమాఖ్య భవన్‌లో ఆయా పార్టీల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్‌ ప్రక్రియకు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 8న చేపట్టనున్న రాజ్‌భవన్‌ ముట్టడి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా సీపీఐ సీనియర్‌ నాయకులు ఆర్‌. శంకర్‌ నాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌, పీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్‌ తదితరులు మాట్లాడారు. ఎస్ఐఆర్‌ ప్రక్రియపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, దీనిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

సమావేశంలో సీపీఐ నాయకులు హరినాయక్‌, సక్రిబాయి, రాజునాయక్‌, నర్సింగ్‌రావు, దశరథ్‌ నాయక్‌, సీపీఐ డివిజన్‌ కార్యదర్శి షేక్‌ మహబూబ్‌, కాంగ్రెస్‌ డివిజన్‌ అధ్యక్షురాలు దేవి, ఇతర నాయకులు మాణిక్‌రావు, బాలు తదితరులు పాల్గొన్నారు.