BREAKING
thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి thumb ● సైనిక్‌ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● Nalgonda: ఉపాధ్యాయులు లేకుండా శర్భాపురం ప్రాథమిక పాఠశాల thumb ● గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా ఉప్పలమ్మ పండుగ thumb ● ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 66 పోలింగ్ కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు thumb ● చదళ్ళ సమీపంలో ప్రధాన రహదారిపై ప్రమాదకర కాలువ.. ప్రయాణికుల ఆందోళన thumb ● మహా పాదయాత్రలో అయ్యప్ప స్వాములకు స్ఫూర్తి యోగ సభ్యుల సంఘీభావం thumb ● నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చకు అవకాశం thumb ● తెలంగాణ, ఏపీలో వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి thumb ● సైనిక్‌ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● Nalgonda: ఉపాధ్యాయులు లేకుండా శర్భాపురం ప్రాథమిక పాఠశాల thumb ● గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా ఉప్పలమ్మ పండుగ thumb ● ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 66 పోలింగ్ కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు thumb ● చదళ్ళ సమీపంలో ప్రధాన రహదారిపై ప్రమాదకర కాలువ.. ప్రయాణికుల ఆందోళన thumb ● మహా పాదయాత్రలో అయ్యప్ప స్వాములకు స్ఫూర్తి యోగ సభ్యుల సంఘీభావం thumb ● నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చకు అవకాశం thumb ● తెలంగాణ, ఏపీలో వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
Test 4
Date of Publish : 05 November 2026, 03:51 pm
Posted by : SEETHA KIRAN KUMAR

టీచర్ నియామకాలపై ఆరు కోర్టు ధిక్కరణ కేసులు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
05 Nov, 2026 - 03:51 PM
10 వీక్షణలు

హైకోర్టు ముందు యోగితా రాణా ఆన్‌లైన్‌ హాజరు

19 మంది అభ్యర్థులను అర్హులుగా గుర్తించిన DEOలు.. వారి సిఫార్సులను ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించిన డివిజన్‌ బెంచ్‌

హైదరాబాద్, నవంబర్ 05 (ఎన్ టుడే న్యూస్): తెలంగాణలో టీచర్‌ నియామకాలకు సంబంధించిన ఆరు కోర్టు ధిక్కరణ కేసుల్లో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ యోగితా రాణా హైకోర్టు ముందు ఆన్‌లైన్‌ ద్వారా హాజరయ్యారు. ఈ కేసుల విచారణ సందర్భంగా అభ్యర్థుల అర్హతలు, జిల్లా విద్యాశాఖ అధికారుల (DEO) సిఫార్సులు, ప్రభుత్వ నిర్ణయాలపై హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది.

19 మంది అభ్యర్థులు అర్హులుగా గుర్తింపు

20 మంది అభ్యర్థుల్లో 19 మందిని జిల్లా విద్యాశాఖ అధికారులు అర్హులుగా గుర్తించినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. GO Ms. No.111 ప్రకారం చివరిగా ఎంపికైన అభ్యర్థుల కంటే ఈ 19 మందికి ఎక్కువ మార్కులు ఉన్నట్లు వివరించారు.

అయితే, అర్హులుగా గుర్తించిన అభ్యర్థులకు సంబంధించి DEOలు చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని డివిజన్‌ బెంచ్‌ ప్రశ్నించింది.

వివరణ కోరిన హైకోర్టు

ప్రభుత్వ నిర్ణయంలో DEOల సిఫార్సులు ఎందుకు ప్రతిబింబించలేదో వివరించాలని హైకోర్టు కోరింది. 2022 జూలై 13న జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు సంబంధించి అభ్యర్థులు సమర్పించిన వినతులు, DEOలు ఇచ్చిన నివేదికలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

ఈ పత్రాలను పరిశీలించిన అనంతరం కోర్టు ఉత్తర్వుల అమలుపై తదుపరి విచారణ కొనసాగనుంది.