BREAKING
thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
Test 4
Date of Publish : 25 November 2026, 12:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉప్పాడలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 12:01 PM
14 వీక్షణలు

గాలింపు ముమ్మరం బోటు దారి తప్పి బంగ్లాదేశ్, మయన్మార్ సముద్ర జలాల్లోకి వెళ్లి ఉండొచ్చని అనుమానం

కోస్ట్‌గార్డ్, నౌకాదళంతో సమన్వయం.. బాధిత కుటుంబాలకు మంత్రి అచ్చెన్నాయుడు భరోసా

అమరావతి: కాకినాడ జిల్లా ఉప్పాడలోని సుబ్బంపేట గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వారి ఆచూకీ కనుగొనేందుకు భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. మత్స్యకారులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సుబ్బంపేటకు చెందిన గరికాని సింహాద్రికి చెందిన బోటుతో పాటు మరో పడవ ఈ నెల 4న చేపల వేట కోసం ఒడిశాలోని పారాదీప్ వైపు బయలుదేరాయి. పారాదీప్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లోకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని మంత్రి వివరించారు. రెండు పడవల్లో ఒకటి ఈ నెల 18న తిరిగి రాగా, మరో బోటు రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు 19న కోస్ట్‌గార్డ్ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు ఈ నెల 19వ తేదీ రాత్రే కోస్ట్‌గార్డ్‌కు లేఖ రాసి గాలింపు చర్యలు చేపట్టాలని కోరారు. దీంతో కాకినాడ, పారాదీప్ కోస్ట్‌గార్డ్ విభాగాలతో పాటు చెన్నైలోని సముద్ర రక్షణ సమన్వయ కేంద్రం ఆధ్వర్యంలో అన్వేషణ ప్రారంభమైంది. గల్లంతైన బోటులో సుమారు 1,500 లీటర్ల డీజిల్, 30 రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాకినాడ కోస్ట్‌గార్డ్ అధికారులు నిర్వహించిన సమావేశంలో బోటు ప్రయాణించిన మార్గం, చివరిగా కనిపించిన ప్రాంతానికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యుల నుంచి సేకరించారు. వారు సూచించిన సముద్ర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా ఇప్పటివరకు బోటు ఆచూకీ లభించలేదు. తుఫాను ప్రభావంతో బోటు దారి తప్పి ఇతర దేశాల సముద్ర జలాల్లోకి కొట్టుకుపోయి ఉండవచ్చన్న అనుమానంతో బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు కూడా సమాచారం అందించినట్లు మంత్రి తెలిపారు. గల్లంతైన మత్స్యకారులు సోరాడ కొండల్రావు, గుంపల ప్రకాశు, తిర్రి నారాయణ, సోరాడ చిన్న, మెరుగు నారాయణ, కండల రాముగా గుర్తించారు. బోటులో ఉన్న ఇంధనం, ఆహార నిల్వలను దృష్టిలో ఉంచుకుని వారు క్షేమంగా ఉంటారనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఆరుగురి ఆచూకీ లభించే వరకు సంబంధిత అధికారులతో సమన్వయం కొనసాగిస్తామని, వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.