BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి
Test 4
Date of Publish : 23 November 2026, 08:24 pm
Posted by : K MAHESH

వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
23 Nov, 2026 - 08:24 PM
6 వీక్షణలు

ధర్మారెడ్డిపల్లి కాల్వ నుంచి రెండు మార్గాల్లో నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలి: రైతు సంఘం జిల్లా నాయకుడు కందుల హనుమంతు

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట, నవంబర్ 23, ఎన్ టుడే న్యూస్:

రామన్నపేట పట్టణంలోని వెంకట్రామయ్య చిన్నచెరువుకు సాగునీరు అందించేందుకు ధర్మారెడ్డిపల్లి కాల్వ నుంచి ప్రత్యేక ఫీడర్ ఛానళ్లను ఏర్పాటు చేయాలని రైతు సంఘం జిల్లా నాయకుడు కందుల హనుమంతు అధికారులను కోరారు. సోమవారం స్థానిక రైతులతో కలిసి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా కందుల హనుమంతు మాట్లాడుతూ.. కుమ్మాయిగూడెం గ్రామంలోని పెద్ద చెరువు నుంచి రామన్నపేటలోని వెంకట్రామయ్య చిన్నచెరువుకు నీరు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. దీంతో చెరువుకు సాగునీరు అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు నిర్మించాలని కోరారు.

రెండు మార్గాల్లో ఫీడర్ ఛానళ్ల ఏర్పాటు చేయాలి

రైల్వే స్టేషన్ సమీపంలోని ఎర్రకుంట పైన ఉన్న ధర్మారెడ్డిపల్లి కాల్వకు ఒక తూము ఏర్పాటు చేసి, అక్కడి నుంచి ఎర్రకుంట, లోతుకుంట, సాకరికుంట మీదుగా వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానల్ నిర్మించాలని సూచించారు.

అలాగే కొమ్మాయిగూడెం రోడ్డులోని కాటమయ్య దేవాలయం సమీపంలో ఉన్న ధర్మారెడ్డిపల్లి కాల్వకు మరో తూము ఏర్పాటు చేసి, రైల్వే బ్రిడ్జి కింద నుంచి వెంకట్రామయ్య చిన్నచెరువుకు రెండో ఫీడర్ ఛానల్ నిర్మించాలని కోరారు. ఈ రెండు మార్గాల్లో నీటిని మళ్లించడం ద్వారా చెరువుకు సాగునీరు అందించవచ్చని వివరించారు.

భూగర్భ జలాల పెరుగుదలకు దోహదం

వెంకట్రామయ్య చిన్నచెరువుకు నీరు చేరడంతో పాటు మధ్యలో ఉన్న కుంటలు కూడా నిండితే భూగర్భ జలమట్టం పెరిగే అవకాశం ఉంటుందని హనుమంతు తెలిపారు. దీనివల్ల పరిసర ప్రాంతాల్లో వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు నీటి లభ్యత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

రైతుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించాలని కోరారు. సాధ్యాసాధ్యాలను అంచనా వేసి ప్రత్యేక ఫీడర్ ఛానళ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో రైతులు కసిరెడ్డి ఇంద్రారెడ్డి, యాట ఇస్తారి, మహమ్మద్ ఎజాస్, బట్టే కృష్ణమూర్తి, సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు.