BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 23 November 2026, 08:29 pm
Posted by : K MAHESH

అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
23 Nov, 2026 - 08:29 PM
8 వీక్షణలు

దాతల సహకారంతో రూ.11,500 అందజేత.. శ్రీహరి కుటుంబానికి అండగా ఉంటాం: ప్రజాసంఘాల నాయకుడు కంబాలపల్లి భాస్కర్

ఇబ్రహీంపట్నం, నవంబర్ 23, ఎన్ టుడే న్యూస్:

మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన ప్రజానాట్యమండలి కళాకారుడు, స్వర్ణకారుడు, రాజకీయ నాయకుడు రాగిపని శ్రీహరి అనారోగ్యంతో బాధపడుతుండటంతో ప్రజాసంఘాల నాయకులు ఆర్థిక సహాయం అందించారు. ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాతల సహకారంతో సేకరించిన రూ.11,500 నగదును శ్రీహరికి అందజేశారు.

ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకుడు కంబాలపల్లి భాస్కర్ మాట్లాడుతూ.. రాగిపని శ్రీహరి గొప్ప రాజకీయవేత్తగా, ప్రజానాట్యమండలి కళాకారుడిగా, స్వర్ణకారుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. తన కళాబృందం ద్వారా ఎంతోమంది యువతీ యువకులను కళారంగం వైపు ప్రోత్సహించి, వారిలో సామాజిక చైతన్యం కల్పించారని తెలిపారు. అనేకమందిని కళాకారులుగా తీర్చిదిద్దడంలో శ్రీహరి పాత్ర ఎంతో ఉందన్నారు.

ప్రజా సమస్యలపై రాజకీయంగా పోరాటం చేసిన వ్యక్తి నేడు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటం బాధాకరమని భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాల కోసం తన సొంత ఇంటిని సైతం అమ్ముకుని ప్రస్తుతం అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు.

కళారంగానికి, సమాజానికి సేవ చేసిన శ్రీహరి వంటి కళాకారుడిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. దాతలు ముందుకు వచ్చి ఆయనకు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కళాకారుడు, స్వర్ణకారుడు రాగిపని శ్రీహరిని ఆదుకోవాలని కోరారు. శ్రీహరి కుటుంబానికి ప్రజాసంఘాల తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆరుట్ల మాజీ సర్పంచ్, దేవాలయ కమిటీ సభ్యుడు అనంగల్లయ్య దయ్య, దేవాలయ కమిటీ సభ్యులు వెదిరె రమణరెడ్డి, ఎన్నుదుల సురేష్, ప్రజాగళం దామర భూపాల్, వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్, గ్రామ పెద్దలు ఆకారం కృష్ణ, రావుల చంద్రయ్య, మార బీరప్ప, చిందం శ్రీశైలం, మహమ్మద్ గలాబ్, చిందం దానయ్య తదితరులు పాల్గొన్నారు.