BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 23 November 2026, 09:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు డివిజన్‌లో నాలుగు మండలాల్లో ముగిసిన నామినేషన్ల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 09:52 PM
6 వీక్షణలు

మూడు రోజుల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు కలిపి 2,830 నామినేషన్లు

చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 281 నామినేషన్లు దాఖలు

విజయవాడ, నవంబర్ 23, ఎన్ టుడే న్యూస్:

ఎన్టీఆర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో దశకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎ.కొండూరు, గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట మండలాల్లో మూడు రోజులపాటు నామినేషన్ల స్వీకరణ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ఈ మూడు రోజుల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు కలిపి మొత్తం 2,830 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి. లక్ష్మీశ వెల్లడించారు.

నవంబర్ 23న చివరి రోజు ఒక్కరోజే సర్పంచ్ స్థానాలకు 281 నామినేషన్లు దాఖలయ్యాయి. మండలాల వారీగా ఎ.కొండూరులో 78, గంపలగూడెంలో 80, తిరువూరులో 80, విస్సన్నపేటలో 43 నామినేషన్లు నమోదయ్యాయి.

వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి ఎ.కొండూరులో 308, గంపలగూడెంలో 373, తిరువూరులో 303, విస్సన్నపేటలో 184 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నాలుగు మండలాల్లో కలిపి వార్డు సభ్యుల స్థానాలకు 1,168 నామినేషన్లు నమోదైనట్లు వివరించారు.

మూడు రోజుల్లో 2,830 నామినేషన్లు

మూడు రోజుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలిస్తే సర్పంచ్ స్థానాలకు మొత్తం 518 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 2,312 నామినేషన్లు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.

నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు, ప్రజలు, అభ్యర్థులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.