BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 23 November 2026, 08:48 pm
Posted by : K MAHESH

చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
23 Nov, 2026 - 08:48 PM
6 వీక్షణలు

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు రూ.2.50 లక్షల ఆర్థిక సాయం అందజేత

నర్సంపేట, నవంబర్ 23, ఎన్ టుడే న్యూస్:

నర్సంపేట మండలం చంద్రయ్యపల్లె గ్రామానికి చెందిన నలుగురు అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన రూ.2.50 లక్షల విలువైన చెక్కులను నాయకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు గ్రామానికి చెందిన పలకల ఇంద్రసేనారెడ్డి, ఎడెల్లి రాజిరెడ్డి, భాషబోయిన నాగరాజు, సింగన భిక్షపతిలకు ఈ ఆర్థిక సాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆపద సమయంలో ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు కొంత ఊరటనిస్తుందని పేర్కొన్నారు.

నర్సంపేట నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సమస్యల పట్ల ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అర్హులైన బాధితులకు ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తున్నారని నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులు అందుకున్న లబ్ధిదారులు తమకు ఆర్థికంగా అండగా నిలిచిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వస్రం నాయక్, ఉపసర్పంచ్ భాషబోయిన శీను, మాజీ సర్పంచ్ భాషబోయిన రవి, గ్రామ పార్టీ అధ్యక్షుడు పాపయ్య, నాయకులు భూషణ కోటి, సల్పాల ప్రభాకర్, ఎన్‌ఎస్‌యూఐ యూత్ మండల అధ్యక్షుడు చిట్టి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.