BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 23 November 2026, 08:31 pm
Posted by : K MAHESH

కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
K Mahesh Munugodu Constituency
23 Nov, 2026 - 08:31 PM
8 వీక్షణలు

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ అప్పులపాలు.. అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ నేతల విమర్శలు

కాళోజీ కళాక్షేత్రం నుంచి విమానాశ్రయం వరకు గత ప్రభుత్వ వైఫల్యాలను వివరించిన నాయిని.. వరంగల్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటన

హనుమకొండ, నవంబర్ 23, ఎన్ టుడే న్యూస్:

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు విమర్శించారు. సోమవారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (డీసీసీ భవన్)లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేపట్టిన పనులు, అసంపూర్తిగా మిగిలిన ప్రాజెక్టులు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.

కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై నాయిని వివరణ

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ వంద అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కొబ్బరికాయలు కొట్టడం, శిలాఫలకాలు వేయడానికే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు ఆ పార్టీని ఎందుకు ఓడించేవారని ప్రశ్నించారు.

గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోందని తెలిపారు. దీనికి కాళోజీ కళాక్షేత్రం నిర్మాణమే ఉదాహరణగా పేర్కొన్నారు. గత ప్రభుత్వం సుమారు రూ.20 కోట్లతో పిల్లర్లు, స్లాబ్ పనులు చేపట్టి నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేసిందని చెప్పారు. నిర్మాణ నాణ్యతపై అనుమానాలు రావడంతో ఎన్ఐటీ నిపుణులతో పరిశీలన చేయించాల్సి వచ్చిందన్నారు. భవనం పటిష్టత కోసం మరో రూ.10 కోట్లు కేటాయించినప్పటికీ ఆ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ అంశంపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.

తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి, కుడా, పర్యాటక శాఖల సమన్వయంతో పనులను ముందుకు తీసుకెళ్లినట్లు వివరించారు. కళాక్షేత్రం నిర్మాణం కోసం సుమారు రూ.80 కోట్ల నిధులు సమకూర్చి పనులు చేపట్టామని తెలిపారు. గతంలో అసంపూర్తిగా వదిలేసిన పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

రింగ్ రోడ్డు, విమానాశ్రయంపై విమర్శలు

వరంగల్ రింగ్ రోడ్డు పేరుతో గత ప్రభుత్వం హడావుడి చేసి శంకుస్థాపనలు చేసినప్పటికీ, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన జీవోనే రద్దయిందని నాయిని విమర్శించారు. వరంగల్ విమానాశ్రయానికి గతంలో 696 ఎకరాల 14 గుంటల భూమి మాత్రమే ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 253 ఎకరాల భూమిని సేకరించిందని తెలిపారు. ఇందుకోసం రూ.205 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.550 కోట్లతో వాటర్ వర్క్స్ ఆధునీకరణ పనులు చేపట్టామని చెప్పారు. నాలుగు అంగుళాల పైపుల స్థానంలో ఎనిమిది అంగుళాల పైపులు ఏర్పాటు చేస్తున్నామని, పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. యూనివర్సిటీ పరిసర ప్రాంతాలకు కూడా పైపులైన్లు చేరుకున్నాయని తెలిపారు. పాలిటెక్నిక్, ఐటీఐ, మడవీధుల అభివృద్ధికి సైతం నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.

బహిరంగ చర్చకు సిద్ధం.. కేటీఆర్‌కు సవాల్

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న పనులపై పూర్తి ఆధారాలు, జీవోలు, నిధుల కేటాయింపులతో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని నాయిని ప్రకటించారు. హనుమకొండ చౌరస్తాలో చర్చకు రావాలని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. రెండు ప్రభుత్వాల హయాంలో ఎంత మేరకు నిధులు వచ్చాయి, ఎంత ఖర్చు చేశారు అనే వివరాలను ప్రజల సమక్షంలో వివరిస్తానన్నారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చకు రావాలని, అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు ప్రజల తీర్పును ఎందుకు ఎదుర్కోలేకపోయారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్‌ను సక్రమంగా అమలు చేయలేని గత పాలకులు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. గతంలో ప్రాజెక్టులను ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్త