BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 23 November 2026, 08:46 pm
Posted by : K MAHESH

కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
23 Nov, 2026 - 08:46 PM
6 వీక్షణలు

తక్కువ నీటి వినియోగంతో లాభదాయక పంటల సాగుపై దృష్టి సారించాలి: జిల్లా ఉద్యాన శాఖ అధికారి జినుగు మరియన్న

బయ్యారం, నవంబర్ 23, ఎన్ టుడే న్యూస్:

తక్కువ నీటి వినియోగంతో అధిక ఆదాయం పొందే పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యాన, కూరగాయలు, కొబ్బరి, ఆయిల్‌పామ్, మల్బరీ వంటి పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు.

సోమవారం బయ్యారం మండలం కోటగడ్డలో నిర్వహించిన క్షేత్రస్థాయి సందర్శనలో ఆయన రైతులతో మాట్లాడారు. కొబ్బరి సాగును కేవలం వ్యవసాయ తోటలకే పరిమితం చేయాల్సిన అవసరం లేదని, పొలాల గట్లపై, ఇంటి పెరట్లో కూడా కొబ్బరి చెట్లను పెంచుకోవచ్చని వివరించారు. ఒక్కో కొబ్బరి చెట్టు ద్వారా ఏడాదికి సుమారు రూ.2 వేల ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. రైతులు తమకున్న భూమిని సమర్థంగా వినియోగించుకుంటూ అదనపు ఆదాయం పొందేందుకు కొబ్బరి సాగును ఒక ప్రత్యామ్నాయంగా పరిశీలించాలని సూచించారు.

శాస్త్రీయ పద్ధతులతో కొబ్బరి సాగు

కొబ్బరి చెట్ల ఎదుగుదలకు అవసరమైన పోషకాలు, సేంద్రియ ఎరువులను తగిన మోతాదులో అందించాలని మరియన్న సూచించారు. శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా చెట్ల ఆరోగ్యాన్ని, దిగుబడిని మెరుగుపరచుకోవచ్చని వివరించారు. నీటి వినియోగాన్ని తగ్గించేందుకు బిందు సేద్యం, భూమిలో తేమను కాపాడేందుకు మల్చింగ్ వంటి పద్ధతులను అనుసరించాలని తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న బిందు సేద్యం, మల్చింగ్‌కు సంబంధించిన రాయితీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగిస్తూ సాగు ఖర్చులను తగ్గించుకునే విధంగా పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు.

ప్రతి గ్రామంలో లాభదాయక పంటల సాగుకు పిలుపు

ప్రతి గ్రామంలో బోర్లు, బావుల కింద కనీసం 50 ఎకరాల విస్తీర్ణంలో లాభదాయకమైన పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసేలా రైతులు ముందుకు రావాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి పిలుపునిచ్చారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, నీటి పొదుపు, సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా వ్యవసాయంలో మెరుగైన ఆదాయం పొందవచ్చని తెలిపారు.

ఈ క్షేత్రస్థాయి కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి జె. నరేందర్, రైతులు నూతక్కి భూషణ్‌రావు, గుడిపాటి రాజారావు తదితరులు పాల్గొన్నారు.