BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 23 November 2026, 08:32 pm
Posted by : K MAHESH

13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
23 Nov, 2026 - 08:32 PM
7 వీక్షణలు

తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణిలో కాలనీవాసుల వినతి

బయ్యారం, నవంబర్ 23, ఎన్ టుడే న్యూస్:

బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలోని 13వ వార్డులో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు జిల్లా అధికారులను ఆశ్రయించారు. సోమవారం మహబూబాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించి, తమ కాలనీలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

13వ వార్డులో సరైన తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాలనీవాసులు తెలిపారు. కాలనీలో బావులు, బోర్లు అందుబాటులో లేకపోవడంతో మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. తాగునీటి అవసరాలు తీర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే, కాలనీలో డ్రైనేజీ నిర్మాణం కోసం నిధులు మంజూరై పనులు ప్రారంభమైనప్పటికీ, స్థానికంగా వచ్చిన అభ్యంతరాల కారణంగా పనులు మధ్యలోనే నిలిచిపోయాయని వివరించారు. దీంతో మురుగునీటి పారుదల సమస్య కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై గతంలో పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినప్పటికీ ఇప్పటివరకు పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదని తెలిపారు.

కాలనీవాసుల వినతిపై అదనపు కలెక్టర్ పురుషోత్తం, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) నాగలక్ష్మి సానుకూలంగా స్పందించారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి 13వ వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా తాగునీరు, మురుగునీటి పారుదల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

జిల్లా ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించడంతో తమ వార్డులో మౌలిక వసతుల సమస్యలు పరిష్కారమవుతాయని కాలనీవాసులు ఆశాభావం వ్యక్తం చేశారు.