BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 23 November 2026, 08:25 pm
Posted by : K MAHESH

నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
23 Nov, 2026 - 08:25 PM
8 వీక్షణలు

ఐదు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల వద్ద ప్రారంభించిన సర్పంచులు

నెల్లికుదురు, నవంబర్ 23, ఎన్ టుడే న్యూస్:

పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించి, వారికి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశపెట్టిన ‘తొలిముద్ద’ అల్పాహార పథకాన్ని సోమవారం నెల్లికుదురు మండలంలోని ఐదు గ్రామాల్లో ప్రారంభించారు.

మండల కేంద్రం నెల్లికుదురుతో పాటు మునిగలవీడు, మదనతుర్తి, దుర్గాభవాని తండా, వస్త్రం తండా గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. నెల్లికుదురు సర్పంచ్ పులి వెంకన్న, మునిగలవీడు సర్పంచ్ బోల్లి కొండ చైతన్య నాగరాజు, మదనతుర్తి సర్పంచ్ వడ్లకొండ రాధా యాకయ్య, దుర్గాభవాని తండా సర్పంచ్ భూక్య వీరన్న నాయక్, వస్త్రం తండా సర్పంచ్ గూగులోతు కరుణ మధు నాయక్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడంతో పాటు వారికి పోషక విలువలు కలిగిన అల్పాహారం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ‘తొలిముద్ద’ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు క్రమం తప్పకుండా పోషకాహారం అందించాలని సిబ్బందికి సూచించారు.

పిల్లల ఆరోగ్యం, ఎదుగుదల, ఉజ్వల భవిష్యత్తుకు పోషకాహారం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న ఇతర సౌకర్యాలను కూడా తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ఉప సర్పంచులు, అంగన్వాడీ టీచర్లు మద్ది విజయ, ఐ. పద్మ, వీరలక్ష్మి, వి. లక్ష్మి, డి. లక్ష్మి, పుష్పలత, సత్తెమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.