BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి
Test 4
Date of Publish : 23 November 2026, 08:09 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
23 Nov, 2026 - 08:09 PM
7 వీక్షణలు

ఓటుకు నోటు వద్దు.. గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే అభ్యర్థులకే ఓటు వేయండి: మూల రాజేంద్రారెడ్డి

నంద్యాల జిల్లా, ఎన్ టుడే న్యూస్:

ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, డబ్బులు తీసుకోకుండా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని ఎన్ టుడే న్యూస్ తరఫున మూల రాజేంద్రారెడ్డి కోరారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని బత్తలూరు, శాంతినగరం, విజయనగరం, బృందావనం, నందింపల్లె గ్రామాల ప్రజలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

ఓటు అనేది ప్రజలకు ఉన్న విలువైన హక్కు అని, దానిని డబ్బులకు అమ్ముకోవడం వల్ల భవిష్యత్తులో ప్రజలే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటు కోసం డబ్బులు తీసుకున్న తర్వాత ఎన్నికైన ప్రజాప్రతినిధులను గ్రామ సమస్యలపై ప్రశ్నించే నైతిక స్థైర్యం తగ్గిపోతుందని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసిన నాయకులు, ఆ తర్వాత ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వెళ్తే తాము డబ్బులు ఇచ్చి ఓట్లు పొందామని చెప్పే పరిస్థితి ఏర్పడవచ్చని అన్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఓటర్లు ముందుగానే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గ్రామానికి ఎవరు అభివృద్ధి చేయగలరో, ప్రజల సమస్యలను ఎవరు పరిష్కరించగలరో ఆలోచించి, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని కోరారు. ఒక్క ఓటుకు కూడా రూపాయి తీసుకోకుండా, తమ గ్రామ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

“ఓటును అమ్ముకోవద్దు.. మన హక్కును మనమే కాపాడుకుందాం. గ్రామ అభివృద్ధికి కృషి చేసే వారిని ఆలోచించి ఎన్నుకుందాం” అని మూల రాజేంద్రారెడ్డి గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.