BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం
Test 4
Date of Publish : 23 November 2026, 08:08 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరి పురపాలకసంఘము చైర్ పర్సన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం,

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
23 Nov, 2026 - 08:08 PM
9 వీక్షణలు

కనిగిరి పురపాలకసంఘము చైర్ పర్సన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక, ప్రమాణ స్వీకరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం పురపాలకసంఘము కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారి టి.అజయ్ కుమార్ చైర్ పర్సన్ శ్రీమతి అచ్చాల తిరుపతమ్మ చేత ప్రమాణ స్వీకరణ చేయించారు. ఎన్నికల అధికారి కౌన్సిలర్ ల చేత ప్రమాణ స్వీకరణ చేయించారు. అనంతరం 32వ వార్డు కౌన్సిలర్ షేక్ ఫిరోజ్ ను వైస్ చైర్మన్ గా కౌన్సిలర్ బుల్లా బాలబాబు ప్రతిపాదించగా, మరో కౌన్సిలర్ గోనుగుంట పవన్ కుమార్ బలపరిచారు. కౌన్సిలర్లు అందరూ ఆమోదించడంతో శ్రీ షేక్ ఫిరోజ్ ని వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్ ను ఆర్.డి.ఓ, కమీషనర్ శాలువాతో సత్కరించి అభినందించారు. చైర్ పర్సన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో కనిగిరి శాసనసభ్యులు శ్రీ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎమ్మెల్యే  డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఘనంగా శాలువాతో సత్కరించారు. కనిగిరి పట్టణ అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేస్తూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం మరియు అభివృద్ధి కార్యక్రమాలను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ పి.శ్రీధర్, జెడ్పిటీసీ, ఎం.పి.టి.సి లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, మునిసిపల్, సచివాలయ, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.