BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి!
Test 4
Date of Publish : 23 November 2026, 08:15 pm
Posted by : K MAHESH

కలెక్టర్ సారూ.. కనికరించండి!

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
K Mahesh Munugodu Constituency
23 Nov, 2026 - 08:15 PM
7 వీక్షణలు

దివ్యాంగ దంపతులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయండి.. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన మహిళకు పెన్షన్ కల్పించండి

యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ, నవంబర్ 23, ఎన్ టుడే న్యూస్:

తమ సమస్యలను పరిష్కరించి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ పలువురు బాధితులు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి విజ్ఞప్తి చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సాధారణ ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రాలు సమర్పించారు.

దివ్యాంగ దంపతులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వినతి

భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన జక్కుల లక్ష్మీదేవి, రాజు దంపతులిద్దరూ దివ్యాంగులు. శారీరక వైకల్యం కారణంగా ఎలాంటి పని చేసుకోలేక జీవనోపాధి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కులాంతర వివాహం చేసుకున్న తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, సొంత ఇల్లు లేక కుటుంబంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల కోసం గత జూలై నెలలో కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నామని, అనంతరం ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు సమర్పించామని వివరించారు. అయినప్పటికీ ఇప్పటివరకు తమకు ఇల్లు మంజూరు కాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తమ కుటుంబ పరిస్థితిని మానవతా దృక్పథంతో పరిశీలించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.

ఆరు సంవత్సరాలుగా అనారోగ్యం.. పెన్షన్ కోసం అభ్యర్థన

గుండాల మండలం తురకల శాపూరం గ్రామానికి చెందిన ఉప్పుల దానమ్మ గత ఆరు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు. శారీరక పరిస్థితి కారణంగా ఎలాంటి పని చేసుకోలేకపోతున్నారని, మందుల ఖర్చులకు సైతం డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

తన పరిస్థితిని పరిశీలించి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందితే వైద్య ఖర్చులు, నిత్యావసర అవసరాలకు కొంత ఊరట లభిస్తుందని విజ్ఞప్తి చేశారు.

ప్రజావాణిలో అందిన వినతులను పరిశీలించి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని బాధిత కుటుంబాలు జిల్లా అధికారులను కోరాయి.