BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 05:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో ప్రత్యేక లోక్ అదాలత్.. రూ.66.83 లక్షల విలువైన 12 కేసులకు పరిష్కారం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 05:28 PM
19 వీక్షణలు

ఖమ్మం జిల్లా, మధిర: మధిర ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో మొత్తం 12 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో 11 ఎస్‌టీసీ ఎన్‌ఐ యాక్ట్ కేసులు, ఒక సీసీ ఎన్‌ఐ యాక్ట్ కేసు ఉన్నాయి. ఈ కేసులన్నింటినీ కలిపి రూ.66,83,000 విలువైన వివాదాలకు పరిష్కారం లభించినట్లు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా ప్రజలు తమ వివాదాలను సులభంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రామిసరీ నోటు కేసులు, బ్యాంకు రుణాలకు సంబంధించిన వివాదాలు, ఆస్తి తగాదాలు తదితర కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ సమయం, ఖర్చు వృథా చేసుకోకుండా ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో సమస్యలకు ముగింపు పలకవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జింకల రమేష్, కె. విజయ్ కుమార్, కోర్టు సూపరింటెండెంట్లు టి. వెంకన్న, సీహెచ్ మల్లేశ్వరరావు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.