ఊటుకూరు కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఊటుకూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి జన్మ నక్షత్రమైన పునర్వసు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస సూరి ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి, నూతన వస్త్రాలతో అలంకరించారు. అనంతరం వివిధ పుష్పాలు, తులసి దళాలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఆలయంలో దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పద్మనాభుని సర్వేశ్వరరావు తెలిపారు.