డోంకేశ్వర్ సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక యాత్ర
డోంకేశ్వర్: మండల ప్రజలు ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని, రైతాంగం పాడి పంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ డోంకేశ్వర్ మండల సర్పంచుల ఫోరం ప్రతినిధులు తిరుమల, యాదాద్రి ఆలయాలను సందర్శించారు.
సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బట్టు సంజీవరాజ్ నేతృత్వంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ ఆధ్యాత్మిక యాత్రలో తోండకూర్ సర్పంచ్ అల్లారి గంగాధర్, నూత్‌పల్లి సర్పంచ్ రాజారెడ్డి, మారంపల్లి సర్పంచ్ గంగాధర్, దత్తాపూర్ సర్పంచ్ ప్రకాష్, గంగాసరం సర్పంచ్ మహేష్, డోంకేశ్వర్ సర్పంచ్ శ్రీకాంత్, నికాల్వూర్ సర్పంచ్ సుమన్, అన్నారం సర్పంచ్ సంజీవ్, సిర్పూర్ సర్పంచ్ భూమన్న, గాదేపల్లి సర్పంచ్ చిన్నారెడ్డి, చిన్న యానాం సర్పంచ్ దశరథ్, కోమటిపల్లి సర్పంచ్ సుమలత తదితరులు పాల్గొన్నారు.
మండల ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి, రైతుల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ఈ ఆధ్యాత్మిక యాత్ర చేపట్టినట్లు సర్పంచుల ఫోరం ప్రతినిధులు తెలిపారు.