BREAKING
thumb ● పైళ్ల ప్రతాప్ రెడ్డికి సీపీఎం నాయకుల నివాళులు thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● పైళ్ల ప్రతాప్ రెడ్డికి సీపీఎం నాయకుల నివాళులు thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు
Test 4
Date of Publish : 25 November 2026, 12:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పల్నాడు ఎస్పీ పనితీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 12:30 PM
17 వీక్షణలు

ఎన్నికల నిర్వహణలో పటిష్ట భద్రతా ఏర్పాట్లపై అభినందన పల్నాడు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి పనితీరును రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటివరకు జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు మూడు విడతల పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టడంపై ప్రశంసలు వ్యక్తం చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం, క్షేత్రస్థాయిలో పోలీసు అధికారుల మధ్య సమన్వయం పెంచుతూ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేలా పర్యవేక్షించడం వంటి చర్యలను అభినందించారు. ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, ఎన్నికల కమిషన్‌కు అవసరమైన సమాచారాన్ని అందించడంతో పాటు వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్న తీరును ప్రశంసించారు. పల్నాడు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా సాగేలా కృషి చేస్తున్న జిల్లా ఎస్పీతో పాటు పోలీసు అధికారులందరినీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అభినందించారు.