అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు
కొత్తపేట: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని అంకంపాలెం, వెలిచెరు గ్రామాల్లోని ఎన్టీఆర్ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
కొత్తపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి ఎ. గజలక్ష్మి ఆదేశాల మేరకు ర్యాలి, ఆత్రేయపురం సెక్టార్ సూపర్‌వైజర్లు కె. పద్మావతి, వై. అరుంధతి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కూటమి నాయకులు, సెంట్రల్ డెల్టా వైస్ చైర్మన్ కరుటూరి నరసింహారావు, సొసైటీ అధ్యక్షుడు నాగిరెడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల పిల్లల తల్లులు, ఐసీపీఎస్ సభ్యులు పాల్గొన్నారు. పోషకాహారం, మహిళల ఆరోగ్యం, అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతల నమోదు, చిన్నారుల ఎదుగుదల పర్యవేక్షణ (గ్రోత్ మానిటరింగ్)పై అవగాహన కల్పించారు.
అలాగే మహిళలు, యువత సోషల్ మీడియాను సురక్షితంగా వినియోగించే విధానం, సైబర్ నేరాల నివారణ, అత్యవసర సహాయ నంబర్లు 100, 112, 181, 1930 గురించి వివరించారు.
కార్యక్రమంలో అంకంపాలెం పంచాయతీ కార్యదర్శి డి. భాను ప్రకాష్, గ్రేడ్-5 కార్యదర్శి ఎస్‌కే. అబ్దుల్ ఖాదర్ జిలానీ, ఐసీడీఎస్ ప్రాజెక్టు జీఎంఎస్‌కే ఎస్‌బీ. సఫియా, అంగన్‌వాడీ సిబ్బంది, స్వర్ణ గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.