మార్కాపురం జిల్లా ఎస్పీని కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై చర్చ
మార్కాపురం: మార్కాపురం జిల్లా నూతన పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)గా బాధ్యతలు చేపట్టిన పంకజ్ కుమార్ మీనాను టీడీపీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ఎం. అశోక్ రెడ్డితో పాటు వైపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీకి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు, నేరాల నియంత్రణ తదితర అంశాలపై ఎస్పీతో చర్చించారు. జిల్లాలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు పోలీసు శాఖ చేపట్టాల్సిన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నారు.